రైతులను మోసం చేసిన ప్రభుత్వం

రైతులను మోసం చేసిన ప్రభుత్వం

0
TMedia (Telugu News) :

రైతులను మోసం చేసిన ప్రభుత్వం 

టీ మీడియా, మార్చి 7,విజయవాడ:భారతీయ జనతాపార్టీ అనుబంధ శాఖ కిసాన్ మోర్చా తలపెట్టిన రైతు ధర్నాను విజుయవంతం చేయాలని అప్పుడే ప్రభుత్వం దిగివస్తుందని బిజెపి ఎంపి జివిఎల్ నరశింహరావు అన్నారు. ఈ నెల 9వ తేదీన గుంటూరు వ్యవసాయ శాఖ కమీషనరేట్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాకు కిసాన్ మోర్చా భారీ సన్నాహాలు మొదలు పెట్టింది ఇందులో భాగంగా రైతాంగానికి వైసిపి వల్ల జరిగే నష్టాన్ని వివరించేందుకు నిర్వహిస్తున్న ధర్నా కు సంబంధించిన పోస్టర్ ను ఎంపి జివిఎల్ నరశింహరావు చేతుల మీదుగా కిసాన్ మోర్చా విడుదల చేసింది. పోరాటం చేస్తే కాని సమస్యలు పరిష్కారం కావని జివిఎల్ అన్నారు.

also read:సింగరేణి లో రెండు రోజుల సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయండి

పాత్రికేయుల సమావేశంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి మాట్లాడుతూ గత 3సం నుండి నీరు అందక ఎరువులు విత్తనాలు అందించటం లో ప్రభుత్వం విఫల మైందిని రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ అదే రైతును మోసం చేసిన ఘనత వైఎస్ఆర్సీపీకి దక్కుతుందని ఏద్దేవా చేశారు
డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీరు ఇవ్వానీ కారణం గా నష్టపోయిన రైతులన్నారు
సంబ్సిడి లో వ్యవసాయ పరికరాలు ఇస్తామని మోసం చేసిన వైఎస్ఆర్సీపీ అని
దేశం లోనే అత్యధికం గా మన రాష్ట్రం లోనే మిర్చి పండుతుంది అని సమయానికి యంత్రాలకు, ఎరువులు విత్తనాలు ఇవ్వాని కారణం గా రైతు నష్టపోయారన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకుని. రాష్ట్ర ప్రభుత్వం కనీసం రైతుకు పరిహారం చెల్లించలేదని అన్నారు

also read:ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి
బీజేపీ ఎప్పుడూ రైతు ప్రభుత్వమని అందుకే కేంద్ర ప్రభుత్వ రైతులకోసం ప్రత్యేక నిధులు కేటాయించామని గుర్తుచేశారు
మిర్చి రైతుకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ నెల 9వ తారీకు న
గుంటూరు లోనీ అగ్రికల్చర్ కమీషనర్ కార్యాలయాన్ని రైతులతో కలిసి ముట్టడిస్తామని కిసాన్ మోర్చా అధ్యక్షు లు శశిభూషణ్ రెడ్డి తెలిపారు
అగ్రికల్చర్ కమీషనర్ కార్యాలయాన్ని రైతులతో కలిసి ముట్టడంచేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోము వీర్రాజు, ఎంపి gvl నరసింహారావు, ఎంపి సీఎం రమేష్, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నాలక్ష్మి నారాయణ , కిసాన్ మోర్చా నాయకులు పాల్గొంటారని తెలిపారు.పాత్రికేయుల సమావేశంలో కిసాన్ మోర్చా రాష్ట్రకార్యదర్శి సిహెచ్ బుచ్చి రాజు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube