అకాల వర్షంతో రైతన్నకు తీవ్ర నష్టం

అకాల వర్షంతో రైతన్నకు తీవ్ర నష్టం

0
TMedia (Telugu News) :

అకాల వర్షంతో రైతన్నకు తీవ్ర నష్టం
టి మీడియా, మే 05, లక్షెట్టిపేట:మండలం లో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షంతో అన్నదాతలకు తీరని నష్టం వాటిల్లింది.మండలంలోని వెంకట్రావు పేట, చందారం,దౌడేపల్లి, జెండా వెంకటాపూర్,తిమ్మాపూర్,రంగపేట్, కొమ్ముగూడెంతో పాటు పలు గ్రామాల్లో గాలివానకు వరి, ఇతర పంటలు తడిసి ముద్దయినాయి. ముఖ్యంగా పలు గ్రామాల్లో 1007 ఎకరాల వరి,150 ఎకరాల జనుము,100 ఎకరాల్లో మినుముల పంట నష్టం జరిగినట్లు మండల వ్యవసాయ అధికారి ప్రభాకర్ తెలిపారు.కాగా , మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు బుధవారం ఉదయం పలు గ్రామాల్లోని పంటలను పరిశీలించి ఫోన్లో జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి తో పంట నష్టం గురించి మాట్లాడారు. రైతులు ఆందోళన చెందవద్దని,ప్రభుత్వం అందరిని ఆదుకుంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పలు గ్రామాల్లో, మండల కేంద్రంలో పలుచోట్ల కరెంట్ పోల్స్ కూలిపోగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది.పంట నష్టంపై అన్నదాతలను ఆదుకోవాలని పలు పార్టీల నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Also Read:కేసీఆర్ విధానాల కార‌ణంగా 24 గంట‌లు విద్యుత్‌

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube