రైతు సంఘర్షణ సభ కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నింపింది

రైతు సంఘర్షణ సభ కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నింపింది

1
TMedia (Telugu News) :

రైతు సంఘర్షణ సభ కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నింపింది

టీ మీడియా,మే 11, జన్నారం: మే నెల 6 శుక్రవారము రోజున వరంగల్ లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభ కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నింపింది అని యువజన కాంగ్రెస్ నాయకులు మంద రాజేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సభలో రైతు డిక్లరేషన్ పట్ల చేసిన అంశాలను రైతులకు,ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏకకాలంలో అన్నదాతలకు రెండు లక్షల రుణమాఫీ చేస్తుంది అని,ఇందిరమ్మ రైతు భరోసా, రైతుల పండించిన పంటలకు మద్దతు ధరాలతోపాటు ప్రభుత్వమే కొంటుదన్నారు.

Also Read : వ్యక్తికి రూ.వెయ్యి కుటుంబానికి రూ.2 వేలు:జగన్

మూతపడిన చెక్కర కర్మాగారాలు తెరవడం,పసుపు బోర్డు ఎప్పుడు, ఉపాదిహామీ పథకాన్ని వ్యవసాయ పంటలకు అనుసంధానం చేయడం,ప్రతి ఎకరానికి సాగునీరు అందేలా అతి తక్కువ సమయంలో సంపూర్ణ ప్రాజెక్టుల పూర్తి, లాభసాటి వ్యవసాయం లక్ష్యంగా ఇంకా వివిధ హామీలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతు కలలను సాకారం చేస్తుందన్నారు. వీటి అన్నింటిని గ్రామాల్లో రైతులకు,ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో కాంగ్రెస్ కార్యకర్తలం బాధ్యతగా పని చేస్తాం అని వారు అన్నారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ, రాష్టంలోని టిఆర్ఏస్ పార్టీలకు ప్రజలే గుణపాఠం చేప్తారన్నారు. రాబోయే ఎన్నికల్లో దేశంలో,రాష్టంలో, ఖానాపూర్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని వారు అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube