రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
టీ మీడియా, నవంబర్ 30, వనపర్తి బ్యూరో : కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరసన దీక్ష వనపర్తి అసెంబ్లీ కేంద్రంలోని ఆర్డిఓ కార్యాలయం నిర్వహించడం జరిగింది. ఈ నిరసన దీక్షకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీమంత్రి డాక్టర్ జి చిన్నారెడ్డి హాజరై మాట్లాడుతూ రైతన్నలకు శాపంగా మారిన రైతు వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేస్తూ అదే విధంగా తక్షణమే ధరణి పోర్టల్ రద్దు, ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ, పోడు భూముల పరిష్కారం తక్షణమే రద్దు చేయాలని వీటి వల్ల రైతులు ఎన్నో రకాలుగా బాధలు పడుతున్నారని ఆరోపించారు. తధానంతరం ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆర్డిఓ కి వినతిపత్రం అందజేసి తమ పై అధికారులకు తెలియజేయాలని సూచించడం జరిగింది.
Also Read : జెండా పండుగ లో పాల్గొన్న చైర్మెన్
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, పట్టణ అధ్యక్షులు డి కిరణ్ కుమార్, మాజీ ఎంపీపీ శంకర్ నాయక్ ,ఓబిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు జెడ్పిటిసి సభ్యులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్, యాదయ్య, రమేష్, గణేష్ గౌడ్, బాబా, చందర్, కృష్ణ బాబు, దేవన్న,చంద్రశేఖర్, డి వెంకటేష్, ప్రతాప్, రోహిత్, జాన్, భాస్కర్ వెంకటేశ్వర రెడ్డి, అక్కి శ్రీనివాస్ గౌడ్, ఎద్దుల విజయవర్దన్ రెడ్డి,మన్యం యాదవ్ నాగరాజ్, అబ్దుల్లా, మన్నెంకొండ నరసింహ, గంధం లక్ష్మయ్య, శ్రీనివాస్ గౌడ్, పెంటన్న యాదవ్ మసికొండా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.