రైతులను మోసం చేస్తే సహించేది లేదు….

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్26, మధిర:

మడుపల్లి ఎన్నికల ముందు రైతులకు పంట రుణాలు మాఫీ చేస్తామని, గిట్టుబాటు ధర కల్పిస్తామని ఎన్నికల ముందు హామీలు ఇచ్చి హామీలు గాలికి విస్మరిస్తూ రైతులు మోసం చేస్తే సహించేది లేదని రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండపర్తి గోవిందరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి గ్రామం లోని సిపిఐ కార్యాలయంలో అమరజీవి కామ్రేడ్ మందడపు నాగేశ్వరరావు గారి ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం 16 మధిర మండల మహాసభ రైతు సంఘం నాయకులు సీనియర్ పంగా శేషగిరిరావు అధ్యక్షతన జరిగింది. ముందుగా రైతు సంఘం జెండాను రైతు సంఘం జాతీయ నాయకురాలు మందడపు రాణి గారు జండా ఆవిష్కరణ చేయడం జరిగింది.అదేవిధంగా ఈ నెల 30వ తారీఖున బోనకల్లు లో జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున రైతు సంఘ సభ్యులు ఈ మహాసభలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు.

ఈ కార్య్రమoలో రైతు సంఘం ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శులు దొండపాటి రమేష్ జక్కుల రామారావు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పగిడిపల్లి ఏసు సీపీఐ మధిర మండల కార్యదర్శి ఓట్ల కొండలరావు మధిర పట్టణ కార్యదర్శి బెజవాడ రవిబాబు పట్టణ సహాయ కార్యదర్శి పెరుమలపల్లి ప్రకాష్ రావు రైతు సంఘం మండల కార్యదర్శి చావా మురళి కృష్ణ ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube