బుద్ధా వెంకన్న నిరాహార దీక్ష భగ్నం

బుద్ధా వెంకన్న నిరాహార దీక్ష భగ్నం

1
TMedia (Telugu News) :

బుద్ధా వెంకన్న నిరాహార దీక్ష భగ్నం

టీ మీడియా,అక్టోబర్ 29,విజయవాడ : ఉత్తరాంధ్రలో టీడీపీ నాయకులు పోరాడితే వైసీపీ నేతల దోపిడి బయటపడుతుంది అనే భయంతో.. అడ్డుకుంటున్నారని బుద్దా వెంకన్నఆరోపించారు..తన నివాసంలోనే నిరాహార దీక్షకు దిగిన బుద్దా వెంకన్నను శుక్రవారముఅర్ధరాత్రి ఆస్పత్రికి తరలించారు పోలీసులు.. బుద్దా వెంకన్నకు షుగర్ లెవల్స్‌ డౌన్ కావడంతో ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు.. అదనపు బలగాలను మొహరించి బుద్దా వెంకన్నను ఆయన నివాసం నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..

Also Read : ఆకట్టుకుంటోన్న పునీత్ రాజ్‌కుమార్‌ భారీ విగ్రహం

ఇక, వెంకన్నను ఆస్పత్రికి తరలించే సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. పోలీసు జీపుకు అడ్డుపడ్డారు టీడీపీ నాయకులు, కార్యకర్తలునుపక్కకు లాగేసి… జీపులో బుద్దా వెంకన్నను ఆస్పత్రికి తీసుకెళ్లారు పోలీసులు.. ప్రభుత్వం, పోలీసుల తీరుపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube