రెండేళ్ల పసి కందును కడతేర్చిన కసాయి తండ్రి

భార్యపై అనుమానంతో చిత్రహింసలు చేసి చంపిన వైనం

0
TMedia (Telugu News) :

రెండేళ్ల పసి కందును కడతేర్చిన కసాయి తండ్రి

– భార్యపై అనుమానంతో చిత్రహింసలు చేసి చంపిన వైనం

టీ మీడియా, జనవరి 4, వనపర్తి బ్యూరో : ఐజా పట్టణంలోని పాత పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న కమ్మరి కుమారి కొడుకు అయిన బాబి(భార్గవ్ )(36) కి కూతురు ,కుమారుడు ఉన్నారు.బార్య శ్రావణి (20) నీ 2 ఏళ్లుగా చిత్రహింసలు చేసి 4 నెలలుగా గొలుసుతో కట్టేసిన ఒక్కపూట కూడా భోజనం పెట్టుకుంటే వారం రోజుల క్రితం శ్రావణి ఇంట్లోంచి వెళ్లి పోతూ తన పిల్లలు కావాలి అని అడిగిన వాళ్ల అత్త ఇవ్వలేదు. అప్పటి నుండి మాటలు కూడా రాని పసికందు బాబును తండ్రి అయిన భార్గవ్ చిత్రహింసలు చేసి స్లీపింగ్ టాబ్లెట్స్ తాపీ చిత్రహింసలు చేసినాడు. గురువారం ఉదయం రక్తం కక్కి చనిపోయిన పసికందు చూసిన చుట్టు పక్కల వారు 100 కి కాల్ చేయడం వల్ల ఈ విషయం బయటికి వచ్చింది.

Also Read : స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు

బాబు తల్లి అయిన శ్రావణి ఫిర్యాదు మేరకు బాబును పోలీసులు పోస్టుమార్టం గద్వాల్ కు పంపించడం జరిగింది. శ్రావణి అత్తని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.చనిపోయిన బాబు యొక్క తండ్రి భార్గవ్ అనారోగ్య పరిస్థితులో హాస్పిటల్లో ఉన్నట్టు సమాచారం.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube