థియేటర్ వద్ద తుపాకీతో వ్యక్తి హల్చల్

థియేటర్ వద్ద తుపాకీతో వ్యక్తి హల్చల్

1
TMedia (Telugu News) :

థియేటర్ వద్ద తుపాకీతో వ్యక్తి హల్చల్
టీ మీడియా,మార్చి 25,పిఠాపురం : పిఠాపురంలో పూర్ణ శ్రీ అన్నపూర్ణా ధియేటర్ వద్ద ఓ వ్యక్తి తుపాకీతో హల్చల్ చేశాడు. దీనితో సినిమాకు వచ్చిన ప్రేక్షకులలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి అరెస్ట్ చేశారు. కాకినాడ డిఎస్పీ వి.భీమారావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నిర్మితమైన ఆర్ఆర్ఆర్ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అందులోభాగంగా పిఠాపురం పూర్ణ శ్రీ అన్నపూర్ణ థియేటర్లలో కూడా సినిమా ప్రదర్శితమవుతోందిపిఠాపురం పట్టణానికి చెందిన మోరోతు వైకుంఠ బాలాజీ అలియాస్ బాలాజీ(33)సినిమా ధియేటర్ బయట తుపాకీతో ఫోజులు ఇస్తూ,సినిమా ధియేటర్ తెరముందు తుపాకీతో తిరుగుతూ కెరింతలు కొడుతుండగా ప్రేక్షకులు భయబ్రాంతులకు గురై స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పిఠాపురం సిఐ వైఆర్కే.శ్రీనివాస్ తమ సిబ్బందితో థియేటరుకు చేరుకుని బాలాజీని అదుపులోకి తీసుకున్నారు.అనంతరం డీఎస్పీ భీమారావు మాట్లాడుతూ నిందితుడికి పిఠాపురంలో స్టీల్ విక్రయ దుకాణం ఉందని అతను తెచ్చిన పిస్టల్ న కండెంమ్ 3పిస్టల్ తో థియేటర్ కు వచ్చాడని, ముఖ్యంగా ఈ పిస్టల్ తో తిరునాళ్ళు, సంబరాల్లో బుడగలు పేల్చే ఆటలో వినియోగిస్తారని,ఒక్కోక్కసారి పక్షులను కాల్చేందుకు వినుయోగిస్తారన్నారు.పిస్టల్ ను లాబ్ కు పంపి నివేదిక కొరతామన్నారు. బహిరంగంగా ప్రేక్షకులను, సమాజాన్ని భయబ్రాంతులకు గురిచేసినందుకు బాలాజీ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Also Read : కేంద్రంపై పోరు ఉధృతం చేసిన టీఆర్ఎస్ ఎంపీలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube