ఫీల్డ్ అసిస్టెంట్లు అరెస్టులు

ఫీల్డ్ అసిస్టెంట్లు అరెస్టులు

0
TMedia (Telugu News) :

ఫీల్డ్ అసిస్టెంట్లు అరెస్టులు
టీ మీడియా, మార్చి 12,పెద్ద శంకరంపేట :ఫీల్డ్ అసిస్టెంట్లను తక్షణమే విధులలోకి తీసుకోవాలని లేనిచో ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని, ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ అధ్యక్షులు నర్సింలు అన్నారు. చలో హైదరాబాద్ పిలుపు ఇచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్లను అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు.శంకరంపేట మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్లను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా కండిచారు. 2006 సం౹౹ము నుండి చాలి చాలని వేతనాలతో సైతం జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని క్షేత్ర స్థాయిలో అమలు పరిచేందుకు
కీలకపాత్ర పోషించామని అన్నారు.

Also Read : బంజారాహిల్స్‌లో విలువైన స్థలం కబ్జా..

తెలంగాణ రాష్ట్రం వస్తే వేతనాలు పెరుగుతాయని, ఉన్న ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయని ఎంతో ఆశ పడ్డ ఫీల్డ్ అసిస్టెంట్లకు నిరాశ ఎదురైంది అని అన్నారు. ఉన్న ఉద్యోగాన్ని లేకుండా చేసి కుటుంబాలను వీధిన పడేసిన చరిత్ర టిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరించి, తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరెస్టు అయిన వారిలో శంకరంపేట ఫీల్డ్ అసిస్టెంట్ల అధ్యక్షులు నర్సింలు, ఉపాధ్యక్షులు భాస్కర్, కార్యదర్శి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube