త్రాగు నీరు ఇవ్వాలని ట్యాంక్ ఎక్కిన యువకుడు

త్రాగు నీరు ఇవ్వాలని ట్యాంక్ ఎక్కిన యువకుడు

0
TMedia (Telugu News) :

త్రాగు నీరు ఇవ్వాలని ట్యాంక్ ఎక్కిన యువకుడు

టి మీడియా, మే 05, మంచిర్యాల: జైపూర్ మండలంలోని మిట్టపల్లి గ్రామ పంచాయతీలో మిషన్ భగీరథ పథకం కింద వాటర్ ట్యాంకు నిర్మాణం పూర్తి అయ్యి 3 సంవత్సరాలు దాటినప్పటికీ గ్రామంలో నీరు మిషన్ భగీరథ పథకం ద్వారా రావడం లేదన్నారు. గత 3-4 సంవత్సరాల నుంచి గ్రామంలో ని ప్రతీ ఇంటికి ఇవ్వవలసిన హావిటేషన్ల నీటిని ప్రతీ ఇంటికి అందిస్తున్నట్టు వాటికి అయిన ఖర్చు చేసినట్లుగా గ్రామ సర్పంచ్ చెక్కుల పైన సంతకం పెడుతున్నట్టు, గ్రిడ్ సంబంధించిన సూపర్ వైజర్, మెకానిక్, పంప్ ఆపరేటర్ లకి మిషన్ భగీరథ పథకం ద్వారా జీతాలు మాత్రం ఇస్తూ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.

Also Read:ఓయూలో రాహుల్‌ పర్యటనకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

గతంలో నీటి సమస్య పరిష్కారానికి డిఇ, ఈఈ ల కార్యాలయంలో పలు మార్లు సమస్యను తెలుపుతూ వినతిపత్రం అందజేసినా కూడా ఎలాంటి స్పందన లేకపోవడం చాలా బాధాకరంగా ఉందన్నారు, అధికారుల, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం కారణంగా గ్రామస్తులు నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు,ఈ సందర్భంగా మిట్టపల్లి గ్రామంలోని ప్రతీ ఇంటికి మిషన్ భగీరథ పథకం నీరు ఎప్పుడు వస్తాయో అధికారుల నుంచి స్పందన వచ్చే వరకు వాటర్ ట్యాంకుపై నుంచి కిందకి దిగకుండా కొత్రాంగి తరుణ్ నిరసన తెలపడం జరిగింది.పోలీసు అధికారులు వచ్చి యువకుడిని క్రింద కు దించారని తెలిపారు.

Also Read:హైదరాబాద్ లో భారీ వర్షం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube