హక్కు లు, ఆత్మ గౌరవం కోసం పోరాడాలి,

సిపిఎం పిలుపు

1
TMedia (Telugu News) :

హక్కు లు, ఆత్మ గౌరవం కోసం పోరాడాలి,

-సిపిఎం పిలుపు,

టీ మీడియా, జూలై 18, రైల్వేకోడూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపి  రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మ,కు  అధికార పార్టీ, వైసిపి, ప్రతిపక్ష పార్టీ టిడిపి, మద్దతు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ, ఆధ్వర్యంలో , అన్నమయ్య జిల్లా, రైల్వేకోడూరులో గాంధీ విగ్రహం  వద్ద సోమవారం  ధర్నా నిర్వహించడం జరిగింది. సిపిఎం పార్టీ జిల్లా నాయకులు సి హెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, నేడు రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా, ఆంధ్రుల హక్కులు, ఆంధ్రుల ఆత్మ గౌరవం కాపాడాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం,  ప్రత్యేక హోదా,విభజన చట్టం హామీలు కానీ, వెనుకబడిన రాయలసీమ ప్రాంతం ప్యాకేజీ గానీ, కడప ఉక్కు గాని, పోలవరం ప్రాజెక్టు నిధులు గాని, రాజధానికి నిధులు కానీ, ఇవ్వకుండా,  రాష్ట్రానికి ద్రోహం చేసిందని. అటువంటి పార్టీకి బిజెపి అభ్యర్థి రాష్ట్రపతి,కి, వైసిపి పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎలా మద్దతు ఇస్తారని ప్రశ్నించారు.

 

Also Read : శాకాంబరి అమ్మవారి బోనాల జాతర

25 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని ప్రగల్బాలు పలికిన ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి  గారు, 22 ఎంపీ సీట్లు ఇస్తే ఎందుకు  తేలేకపోయారు అని నిలదీశారు. ప్రస్తుతం వైసీపీ మద్దతు లేకుండా రాష్ట్రపతి గెలిచే పరిస్థితి లేదన్నారు, ఎటువంటి షరతులు లేకుండా బేషరతుగా బిజెపికి మద్దతు ఇచ్చారన్నారు. మెడలు వంచుతామని, తానే  కేసులకు భయపడి , రాష్ట్రానికి మోసం చేసిన మోడీకి మెడలు  వంచారు, అని విమర్శించారు. లౌకిక  పార్టీల మని చెప్పుకునే వైసిపి, టిడిపి, మతోన్మాద బీజేపీకి మద్దతు ఇవ్వడంతో, అసలు రంగు బయటపడింది అన్నారు. మైనార్టీలను మోసం చేస్తున్నారన్నారు. సామాజిక న్యాయం కోసమే మద్దతు ఇస్తున్నామని డొంకతిరుగుడు మాటలు చెబుతున్నారని, గతంలో గిరిజన నాయకుడు సంగ్మా రాష్ట్రపతి  కి పోటీచేస్తే, ఈ పార్టీలు ఎందుకు మద్దతు ఇవ్వలేదని  ప్రశ్నించారు,  కేంద్రంలో బిజెపి, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు,  నిత్యావసర ధరలు,  పెంచి, ప్రజలపై భారం  మోపారు అన్నారు,విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, మైనార్టీ వ్యతిరేక చట్టాలు, కార్మిక వ్యతిరేక చట్టాలు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం, ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నా,  బీజేపీకి ఎలా మద్దతిస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్షాల బలపరుస్తున్న లౌకిక పార్టీ అభ్యర్థి యశ్వంత్ సిన్హా గారికి ఆత్మ సాక్షిగా, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఓటు వేయాలని, రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని ఓడించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రుల హక్కులు, ఆత్మ గౌరవం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కన్వీనర్ లింగాల యానాదయ్య, దాసరి జయచంద్ర, బొజ్జ శివయ్య,  డమ్ము ,శివ శంకర్, శ్రీనివాసులు, హరి, చిట్వేల్ సిపిఎం మండల నాయకులు పగడాల భరత్ కుమార్, ఓబులవారిపల్లి, సిపిఎం నాయకులు  నాగి పోగు. పెంచలయ్య, కె. రమణయ్య, పెనగలూరు సిపిఎం నాయకులు, మద్దెల ప్రసాదు.  నగిరి పాటి వెంకటమ్మ, లక్ష్మీదేవి, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube