సింగరేణి కోసం పార్లమెంట్ లో అలుపెరగని పోరు
-కేంద్ర భారి నుంచి కాపాడుకున్నాం
-లాభాల బాట పట్టించి,కార్మికులకు పంచాం
– సండ్ర వెంకట వీరయ్య ను మంచి మెజార్టీతో గెలిపించాలి
– ఆత్మీయ సమావేశంలో ఎంపీ నామ నాగేశ్వరరావు
టి మీడియా, నవంబర్ 20, సత్తుపల్లి : కేంద్రం సింగరేణిని ప్రైవేటీకరించకుండా పార్లమెంట్ లో పెద్ద ఎత్తున పోరాటం చేసి, అడ్డుకోవడం జరిగిందని బీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత , ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. సత్తుపల్లి లో ఆదివారం జరిగిన సింగరేణి కార్మికుల ఆత్మీయ సమ్మేళనం లో నామ పాల్గొని మాట్లాడారు. సింగరేణి కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో కెసిఆర్ ప్రభుత్వం అగ్రభాగన నిలిచిందని పేర్కొన్నారు .
సింగరేణి కార్మికులకు వంశపారంపర్య ఉద్యోగాలు ఇవ్వడంతోపాటు సంస్థను లాభాల పట్టించేం దుకు కేసీఆర్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసిందని చెప్పారు . నిత్యం కార్మికుల సమస్యల పరిష్కారంలో సండ్ర వెంకట వీరయ్య ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పని చేశారని గుర్తు చేశారు. ఎల్లవేళలా తోడు నీడగా ఉన్న సండ్ర వెంకట వీరయ్య ను మంచి మెజార్టీతో గెలిపించి, అసెంబ్లీకి పంపించి, మరింత అభివృద్ధి కి అవకాశం కల్పించాలని నామ సింగరేణి కార్మిక కుటుంబాలను కోరారు.
Also Read : గడప గడపకు కేసీఆర్ మేనిఫెస్టో
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, పార్టీ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య , మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ ,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహే శ్వరరావు ,నాయకులు చల్లగుండ్ల కృష్ణయ్య, రమేష్ , మహ్మద్ రఫీ పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు .
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube