పోరాటం మళ్లీ మొదలు

పోరాటం మళ్లీ మొదలు

1
TMedia (Telugu News) :

పోరాటం మళ్లీ మొదలు

టీ మీడియా,ఆగస్టు 25, హైదరాబాద్‌ : అవినీతి, లంచాల వ్యవస్థ మీద పోరాటం చేసిన ‘భారతీయుడు’ అప్పట్లో సిల్వర్‌ స్క్రీన్‌పై సంచలనం సృష్టించాడు. ఈసారి సమాజంలోని మరో జాఢ్యాన్ని లక్ష్యంగా చేసుకుని మళ్లీ తిరిగొస్తున్నాడు. ‘ఇండియన్‌ 2’ పేరుతో కమల్‌ హాసన్‌ హీరోగా 2019లో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లింది.కొంత జరిపాక పాండమిక్‌లో చిత్రీకరణ నిలిపి వేశారు.

 

Also Read : ప్ర‌ధాని మోదీకి భ‌ద్ర‌తా వైఫ‌ల్యం

ఈ సినిమాను ఇటీవల పూజా కార్యక్రమాలతో లాంఛనంగా తిరిగి మొదలుపెట్టారు. సందేశాన్ని, వినోదాన్ని కలగలిపి మెప్పించిన దర్శకుడు శంకర్‌… ఈసారి మరింత బలంగా కథను చూపించబోతున్నట్లు తెలుస్తున్నది. ఈ చిత్రంలో రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సిద్ధార్థ్‌, కాజల్‌ అగర్వాల్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే నెల మొదటి వారంలో కమల్‌ హాసన్‌ షూటింగ్‌లో జాయిన్‌ కానున్నారు. లైకా ప్రొడక్షన్స్‌, ఉదయనిధి స్టాలిన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube