చిత్తశుద్ధి ఉంటే ప్రైవేటీకరణ రద్దయేవరకు పోరాడాలి

వి.సీతారామయ్య

0
TMedia (Telugu News) :

చిత్తశుద్ధి ఉంటే ప్రైవేటీకరణ రద్దయేవరకు పోరాడాలి

– వి.సీతారామయ్య

టీ మీడియా, జనవరి 14, గోదావరిఖని : రాష్ట్ర ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే బొగ్గుగనుల ప్రైవేటీకరణ రద్దయే వరకు పోరాడాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య అన్నారు.శనివారం జీడీకె ఓసిపి 5,ఏరియా వర్కుషాపులో జరిగిన గేటు మీటింగుల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ… 2015 లో బొగ్గుగనుల ప్రైవేటీకరణకు మద్దతు పలికారని,ఇప్పుడైనా వ్యతిరేకించడం సంతోషకరమే ఐనా కేంద్రం అరబిందో కంపనికి కెటాయించిన కోయగూడెం 3వ గనికి రాష్ట్రప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా అడ్డుకోవాలన్నారు.అదే విధంగా తాడిచర్ల గనిని తెలంగాణ ప్రభుత్వం ఏఎంఆర్ ప్రైవేట్ సంస్థకు బొగ్గు తీయడానికి ఇవ్వడాన్ని విరమించుకొని సింగరేణికి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.11వ వేజ్ బోర్డులో కనీస పెరుగుదలను ప్రయోజనకరంగా సాధించామని పూర్తి ఒప్పందం త్వరలో జరుగుతుందని అన్నారు.ఈ సమావేశంలో నాయకులు వేల్పుల నారాయణ,గౌతం గోవర్ధన్,ఎం.మహేశ్,గండి

Also Read : పారిశ్రామిక పురోగ‌తికి స‌హ‌క‌రించాలి

ప్రసాద్,ప్రభుదాస్,ఆర్.శ్రీనివాస్,పి.రాజయ్య,ఏ.హరినాథ్,ఏ.సుధాకర్,రామారావు,బి.సతీష్,పులి వెంకటేశ్వర రెడ్డి,బల్సు రవి, సిపిఐ నగర సహాయ కార్యదర్శి మద్దెల దినెష్, ఆఫీసు కార్యదర్శి తొడుపునూరి రమేష్, కుమార్,2ఏ.గనిలో జరిగిన మీటింగ్ లో నాయకులు ముసికె.సమ్మయ్య,మడ్డి. ఎల్లయ్య,రంగుశ్రీనివాస్,పి.నాగేందర్,కారంపూడి వెంకన్న,సంగి సమ్మయ్య,పొన్నాల వెంకటయ్య,తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube