కేంద్రంపై పోరు ఉధృతం చేసిన టీఆర్ఎస్ ఎంపీలు
-రాష్ట్రానికి నవోదయలు కేటాయింపుకు డిమాండ్
-పార్లమెంట్లోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన
కేంద్రం వివక్ష సరికాదుః టీఆర్ఎస్ పక్ష నేత నామ
టీ మీడియా,మార్చి 25న్యూఢిల్లీ:తెలంగాణ రాష్ట్రంపై నిలువునా నిర్లక్ష్యం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ద్వంద, తెలంగాణ వ్యతిరేక వైఖరిపై పోరాటాన్ని ఢిల్లీ వేదికంగా ఎంపీలు మరింత ఉధృతం చేశారు. రాష్ట్రానికి నవోదయ విద్యాలయాలు ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. తక్షణమే తెలంగాణ లో జిల్లాకో నవోదయ కేటాయించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం లోక్సభ ప్రారంభం కాగానే, టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు నేతృత్వంలో టీఆర్ఎస్ ఎంపీలు స్పీకర్ ఓంబిర్లాకు వాయిదా తీర్మానం ఇచ్చారు. సాధారణంగా జిల్లాకి ఒక నవోదయ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, బీజేపీ పాలిత రాష్ట్రాలకు జవహర్ నవోదయ విద్యాలయాలు జిల్లాకు ఒకటి కంటే ఎక్కువ కేటాయించారని వివరించారు. తెలంగాణకు మాత్రం జిల్లాకి ఒకటి కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. అందుచేత, ఈ విషయంపై న్యాయం జరిగేందుకు సభలో చర్చకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ను, ఎంపీ నామ నాగేశ్వరరావు కోరారు. ఎంపీ నామ విజ్ఞప్తిని స్పీకర్ ఓంబిర్లా తిరస్కరించడంతో టీఆర్ఎస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సభ నుంచి బయటికి వచ్చి వారంతా పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చిన నిరసన తెలిపారు. తెలంగాణపై అన్నిరకాల వివక్ష సరికాదని టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై గత ఎనిమిది ఏళ్లుగా లేవనెత్తుతూనే ఉన్నామని గుర్తు చేశారు.
Also Read : విద్యుత్ చార్జీల పెంపును ఉపసంహరించుకోండి
కొత్తగా నవోదయ విద్యాలయ ఏర్పాటు గురించి వాయిదా తీర్మానం ఇచ్చామని తెలిపారు. వాటిని అనుమతించకపోవటంతో ఉభయ సభల నుంచి వాకౌట్ చేశామని స్పష్టం చేశారు. 23 జిల్లాలో కొత్తగా నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్, ఎంపీలు వినతి పత్రం ఇచ్చినా కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 33 జిల్లాలు ఉంటే గతంలో ఇచ్చిన 9 మినహాయిస్తే కొత్తగా ఒక్క నవోదయ విద్యాలయాన్ని కూడా కొత్తగా కేటాయించలేదని నామ వివర్శించారు. అసోం లాంటి చిన్న రాష్ట్రానికి కూడా 27 నవోదయలు ఇచ్చారని వివరించారు. తెలంగాణ విద్యార్థులపై అక్కసుతో కేంద్రం పలు విద్యా సంస్థలు, కొత్త మెడికల్ కాలేజీలు మంజూరు చేయడం లేదని ఆయ అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయం, తెలంగాణకు మరొక న్యాయం అన్న విధంగా కేంద్రం వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. నవోదయ విద్యాలయ పనితీరులో కేరళ తర్వాత రాష్ట్రంలో తెలంగాణ ఉందని ఎంపీ నామ చెప్పారు. ఇటీవల 80 నవోదయ విద్యాలయాలు కొత్తగా కేంద్రం మంజూరు చేస్తే అందులో ఒక్కటి కూడా తెలంగాణకు కేటాయించలేదని నామ పేర్కొన్నారు.
Also Read : విద్యుత్ చార్జీల పెంపును ఉపసంహరించుకోండి
మొదటి రోజు నుంచి పోరాటమే!
సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం మేరకు రెండవ విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయిన నాటి నుండి పార్లమెంట్ ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీలు రైతులు, నిరుద్యోగులు, ఎస్టీ రిజర్వేషన్స్, విభజన హామీలు, రాష్ట్రానికి నిధులు తదితర అంశాలపైన ప్రతి రోజు పార్లమెంట్ లోపల, బయట ఆందోళన చేస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్కటి సీఎం కేసీఆర్ నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటున్నామని గుర్తు చేశారు. కానీ రాష్ట్రానికి కేంద్రం రాష్ట్రానికి చేయాల్సిన ఏ ఒక్కటి చేయటం లేదని మండిపడ్డారు. గత 8 సంవత్సరాల్లో దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 7 ఐఐఎం లు, 7 ఐఐటి, 2 ఐఐఎస్ఇఆర్, 16 ఐఐఐటి లు, 4 ఎన్ఐడి లు 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేశారని, తెలంగాణకు ఒక్క నవోదయ విద్యాలయం కూడా చేయలేదని ఇది తెలంగాణ ప్రజల మీద, విద్యార్థుల మీద కేంద్రం పగ ఉందని అనిపిస్తుందని అభిప్రాయపడ్డారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube