మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన యుద్ధవిమానాలు..

మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన యుద్ధవిమానాలు..

0
TMedia (Telugu News) :

మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన యుద్ధవిమానాలు..

టి మీడియా,జనవరి 28,గ్వాలియర్‌ : మధ్యప్రదేశ్‌లో రెండు యుద్ధవిమానాలు కుప్పకూలాయి. గ్వాలియర్‌లోని వాయు సేన స్థావరం నుంచి ఆకాశంలోకి ఎగిరిన సుఖోయ్-30, మిరాజ్-2000 విమానాలు..మోరినా సమీపంలో క్రాష్ అయ్యాయి. సమాచారం అందుకున్న సహాయక బృందాలు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నాయి. శిక్షణ సమయంలో విమానాలు కూలాయని అధికారులు తెలిపారు. శనివారం తెల్లవారుజామున 5.30 గంటలకు ప్రమాదం జరిగినట్లు మోరీనా కలెక్టర్ తెలిపారు. SU-30 నుండి పైలట్‌లు సురక్షితంగా బయటపడ్డారని, వారికి స్వల్ప గాయాలయ్యాయని ఆయన చెప్పారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Also Read : ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి క‌న్నుమూత‌

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube