వ్యాపారి ఐపీ దాఖలు
-భారీగా నష్టం వచ్చినట్టు పిటిషన్
టీ మీడియా, ఫిబ్రవరి 6, ఖమ్మం : నగరం, బురహాన్ పురానికి చెందిన వ్యాపారి దందుబోయిన లక్ష్మణ రావు వ్యాపారం నష్టం వచ్చి దివాళా తీసినట్టు ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో దివాళా పిటిషన్ దాఖలు చేశారు. తాను 2015 శ్రీ తిరుమల నెట్‌కేఫ్ పేరుతో ఇంటర్నెట్ వ్యాపారాన్ని ప్రారంభించానని, ప్రారంభంలో మంచిగా నడిచిన నెట్ కేఫ్, తదనంతర పరిణామాల్లో 2019 నుంచి కరోన పరిస్థితుల మూలంగా వ్యాపారంలో నష్ట వాటిల్లడంతో, పరిస్థితులు చక్కబడతాయనే ఉద్ధేశ్యంతో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి వ్యాపారాన్ని కొనసాగించానని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా వ్యాపారంలో వచ్చిన సొమ్ము ఏ నెలకు ఆ నెల అధిక వడ్డీలు తీర్చడానికి సరిపోతుందని, దీంతో అప్పులు ఇచ్చిన వాళ్లు బలవంతంగా ఖాళీ ప్రామిసరీ నోట్‌లు, చెక్‌ల పై సంతకాలు తీసుకొని వేధిస్తున్నారని,
Also Read : తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు ఇలా
దీంతో విధిలేని పరిస్థితుల్లో ఆరుగురుని ప్రతి వాదులుగా చేరుస్తూ పదకొండు లక్షల ఇరవై ఐదు వేలకు దివాళా పిటిషన్ దాఖలు చేసినట్టు పిటిషన్ దాఖలు చేశారు. కాగా తనకు గల ఆస్థుల వివరాలను కూడా పిటిషన్‌లో తెలియజేశారు. పిటిషన్ తరపు న్యాయవాదిగా దొంతెబోయిన రామారావు వ్యవహరిస్తున్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube