లా విద్యార్థి చదువుకు ఆర్థిక సహాయం

లా విద్యార్థి చదువుకు ఆర్థిక సహాయం

0
TMedia (Telugu News) :

లా విద్యార్థి చదువుకు ఆర్థిక సహాయం

టీ మీడియా,జనవరి 17, ఆలమూరు : గ్రామానికి చెందిన యాళ్ల నరసింహమూర్తి కుమారుడు యాళ్ల విష్ణువర్ధన్ “లా” చదువు నిమిత్తం ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ మురళీకృష్ణ సంస్థల అధినేత, అపర దానకర్ణుడు బిరుదాంకితులు “వంటిపల్లి పాపారావు” ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విష్ణువర్ధన్ “లా” చదువు నిమిత్తం పూర్తి బాధ్యత తీసుకుంటున్నట్లు ఆయన తెలియజేశారు. విష్ణువర్ధన్ తండ్రి నరసిమూర్తి అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ కుటుంబానికి అండదండగా ఉంటానని హామీ ఇచ్చారు. “లా” సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో 1700 ర్యాంకు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విష్ణువర్ధన్ ని పాపారావు ఈ సందర్భంగా అభినందించారు.

Also Read : వ్యవసాయ మార్కెట్ కు సెలవు

కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన పాపారావుని విష్ణువర్ధన్ తండ్రి నరసింహమూర్తి ఈ సందర్భంగా కన్నీటి పర్యంతమై కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాతి కుమార్ రాజా, కొప్పనాతి శ్రీనివాస్, చిన్నం హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube