నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన ఎంపీటీసీ సత్యం

0
TMedia (Telugu News) :

టీ మీడియా,డిసెంబర్31,కరకగూడెం;

పినపాక మండలంలోని తోగ్గూడెం పంచాయతీ పరిధిలో గోపాలరావు పేట గ్రామానికి చెందిన కోళ్ల పెద్దిరాజు ప్రమాదానికి గురై కొంత కాలంగా మంచానికి పరిమితమయ్యారు.
అతని వైద్య ఖర్చులకు కూడా డబ్బులు లేని స్థితి స్పందించిన తోగ్గూడెం ఎంపీటీసీ చింతపంటి సత్యం 2000, గ్రామ పెద్దలు 2000, 20 కేజీల బియ్యాన్ని ఆర్థిక సహాయం కూడా అందించారు. ఈ కార్యక్రమంలో తోగ్గూడెం ఉపసర్పంచ్ బుస్సి శ్రీనివాసరావు,ఆత్మ కమిటీ సభ్యులు సూర నరసింహారావు, ఊడుగుల రామచంద్రు, కొంపెల్లి మల్లేష్, కొంపెల్లి నాగేశ్వరరావు, కూనారపు సత్యనారాయణ, గోరంట్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube