అంగన్ వాడి ఆయా కుటుంబానికి ఆర్థిక సహాయం
టీ మీడియా, ఫిబ్రవరి 4, వనపర్తి బ్యూరో : వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు శాఖాపూర్ వై గ్రామంలో చనిపోయిన అంగన్వాడి ఆయా పుల్లమ్మ కుటుంబానికి ప్రభుత్వం తరపున సర్పంచ్ మేకల రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో అంగన్వాడి ప్రాజెక్టు డైరెక్టర్ ఆఫీసర్ లక్ష్మీ, సూపర్వైజర్ బాలీశ్వరి, 20 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని పుల్లమ్మ కోడలు సాయమ్మకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లక్ష్మీ వెంకటయ్య, పంచాయతీ కార్యదర్శి శేఖర్ రెడ్డి, వార్డు సభ్యులు సందేపాగ రమేష్, అంగన్వాడీ టీచర్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.