గుండె సంబంధిత చికిత్సకు ఆర్థిక సాయం
టీ మీడియా, డిసెంబర్ 6, వనపర్తి బ్యూరో : పెబ్బేరు మండలం శాఖాపూర్ వై గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ రాముడును అమీర్ పేట లాల్ బంగ్లా వెల్నెస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు మంగళవారం సర్పంచ్ మేకల రవికుమార్ యాదవ్, సింగల్ విండో వైస్ చైర్మన్ చెక్కుల ఆంజనేయులు, ఉప సర్పంచ్ సంద ఎల్లయ్య,మోడల ఆంజనేయులు సాగర్, పరామర్శించి గుండె సంబంధిత చికిత్స కోసం గ్రామ పంచాయతీ తరపున 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. రాముడికి వెల్నెస్ ఆసుపత్రిలో గుండె సంబంధిత చికిత్స స్టంట్ వేయడం జరుగుతుంది. చికిత్స విజయవంతమై రాముడు ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.