విద్యార్థుల పై చదువుల కోసం ఆర్థిక సహాయం అందచేత

విద్యార్థుల పై చదువుల కోసం ఆర్థిక సహాయం అందచేత

1
TMedia (Telugu News) :

విద్యార్థుల పై చదువుల కోసం ఆర్థిక సహాయం అందచేత

టీ మీడియా, సెప్టెంబర్ 23, జన్నారం : మండలంలోని బంగారు తండా కు చెందిన నేతావత్ ప్రశాంత్ అనే విద్యార్థికి బీహార్ లోని పాట్నా ఐఐటీలో మరియు బాదావత్ ప్రతిమ అనే విద్యార్థినికి కేరళలోని పాలకడ్ యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీర్ విభాగంలో సీట్లు సాధించారు. అడ్మిషన్ ఫీజు తలా ఒకరు 37 వేల రూపాయలు చెల్లించే ఆర్థిక స్తోమత లేక చదువు మానుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న జగిత్యాల ప్రముఖ వైద్యులు, సంఘ సేవకులు ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి ఆ ఇద్దరు విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేయడానికి ముందుకు వచ్చారు. గురువారం రోజు బంగారు తండా కు వెళ్లి స్థానికులతో మాట్లాడి ఇద్దరు విద్యార్థులకు 74 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు.

Also Read : నేడు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన

ఆయన మిత్రుడు టిఆర్ఎస్ నాయకులు పూర్ణచందర్ నాయక్ తనవంతు గా తలా పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద గిరిజన విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఆర్థిక సాయం అందజేయడం సంతృప్తి గా ఉందన్నారు. నిరుపేద విద్యార్థుల ఆర్థిక సమస్యను దాతల దృష్టికి తీసుకెళ్లడంలో యువత ముందుండాలని కోరారు.తమ ఉన్నత విద్యాభ్యాసానికి ఆర్థిక సాయం అందజేసిన డాక్టర్ ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి, పూర్ణచందర్ నాయక్ లకు విద్యార్థులు ఎంతో రుణపడి ఉంటామని తెలిపారు. విద్యార్థుల పై చదువుల కోసం ఆర్థిక సాయం అందజేసిన వారిద్దరిని జన్నారం ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube