ఐదు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత

0
TMedia (Telugu News) :

టీ మీడియా;
కొడిమ్యాల : డిసెంబరు 30
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ఐదు కుటుంబాలకు మనతరం మానవ సంక్షేమ మండలి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కొడిమ్యాల పశు వైద్యాధికారి పల్లె ప్రసాద్ ఒక్కరికి వెయ్యి చొప్పున 5000 రూపాయల చెక్కులను అందజేశారు. కరోనతో భర్తలు కోల్పోయిన రాచకొండ రూప, న్యాతే రోజ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాచర్ల వరలక్ష్మి, పెంకాసుల లక్ష్మి, దనాకుల మంజుల కు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి పల్లె ప్రసాద్,సండ్రాళ్లపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏనుగు ఆదిరెడ్డి, మనతరం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పీటా అభినయ్, మహిళలు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube