ఆర్థిక సహకారం చేసిన మాజీ ఎమ్మెల్యే

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 24 వనపర్తి : వనపర్తి పట్టణంలో నిర్వహించిన మండలపూజకు రావుల 50 వేలరూపాయల ఆర్థిక సహకారం చేశారు. పట్టణంలో అయ్యప్పస్వామి దేవాలయంలో ప్రతిఏటా ఘనంగా నిర్వహించే మండల పూజకు రావుల చంద్రశేఖర్రెడ్డి ముత్తుకృష్ణ గురుస్వామి ద్వారా చైర్మన్ గారికి అందజేశారు. ఈ సందర్భంగా మారం బాలేశ్వరయ్య, రఘువీరారెడ్డి, ముత్తుకృష్ణ గురుస్వాములు మాట్లాడుతూ ఆలయ ప్రతిష్ట నుండి ప్రతి ఏటా మండలపూజకు రావుల సహకారం అందిస్తున్నారని అదేవిధంగా ఆలయ నిర్మాణంలో ప్రభుత్వ నిధులు కేటాయించి తోడ్పడాలని అన్నారు. ఇటీవల ఆలయ ముఖద్వారం వారి తల్లి రావుల వెంకటపద్మమ్మ జ్ఞాపకార్థం ఐదు లక్షల రూపాయల సొంత నిధులతో నిర్మించారని అన్నారు. ఆదివారం రోజు రావుల చంద్రశేఖర్ రెడ్డి మండల పూజలు పాల్గొంటున్నారని కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నందిమల్ల అశోక్ గురుస్వామి, శీను గురుస్వామి, భాస్కర్ రెడ్డి గురు స్వామి, ఆలయ కమిటీ సభ్యులు నాగేశ్, రమణ, అనిల్ ,పాండు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube