ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆర్ధిక సహాయం

ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆర్ధిక సహాయం

1
TMedia (Telugu News) :

ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆర్ధిక సహాయం

టీ మీడియా, నవంబర్ 5, మంచిర్యాల : చెన్నూరు నియోజకవర్గం, కోటపల్లి మండలం, అన్నారం గ్రామానికి చెందిన కోట రవీనా నీట్ లో ఉత్తమ ర్యాంకు సాధించి మహబూబ్ నగర్, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్ సాధించింది. నిరుపేద కుటుంబానికి చెందిన రవీనా హాస్టల్, యూనివర్సిటీ ఫీజు చెల్లించలేని పరిస్థితుల్లో
ప్రభుత్వ విప్ & చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ శనివారం హైదరాబాద్ లో లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి కూడా కష్టపడి చదివి సీట్ సాధించిన విద్యార్థినిని ఆయన అభినందించారు. రానున్న రోజుల్లో మరింత కష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని ఆకాంక్షించారు.

Also Read : నీట్ విద్యార్థికి సన్మానం

కష్టకాలంలో తమకి అండగా నిలిచిన ఎమ్మెల్యే బాల్క సుమన్ కు రుణపడి ఉంటామని తెలిపిన విద్యార్థిని రవీనా. ఎమ్మెల్యే గారి మాటలు తమలో ఎంతో స్ఫూర్తిని, ధైర్యాన్ని నింపాయని ఈ సందర్భంగా తెలిపారు. కష్టపడి చదివి సుమన్ అన్న తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తానని తెలిపింది.ఒక పేద విద్యార్థిని ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి ఆర్థిక సహాయం అందించి వారిలో ఉన్న సేవాగుణాన్ని మరోసారి తెలిపిన చేసిన ఎమ్మెల్యే బాల్క సుమన్ గారిపై చెన్నూరు నియోజకవర్గ ప్రజలు సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube