క్రీడాకారిణికి ఆర్థిక చేయూత

క్రీడాకారిణికి ఆర్థిక చేయూత

1
TMedia (Telugu News) :

క్రీడాకారిణికి ఆర్థిక చేయూత

టీ మీడియా, జూలై18, వనపర్తి బ్యూరో : జాతీయస్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకి వెళ్తున్న విద్యార్థినికి వనపర్తి పట్టణానికి చెందిన నందిమల్ల రవి ఆర్దిక సహాయం చేశారు.WAKO ఇండియా వారు ఈ నెల జులై 19-24 తేదీల్లో కలకత్తాలో నిర్వహించనున్న జాతీయస్థాయి జూనియర్ ఛాంపియన్షిప్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున వనపర్తి జిల్లాకు చెందినటువంటి గోజురియో కరాటే కిక్ బాక్సింగ్ అకాడమీకి చెందిన దాసరాజుల అనన్య తండ్రి మహేష్ (12 years – 30 కే.జి విభాగంలో ) పోటీ పడుతున్న ఈ తెలుగు మత్స్యకార ముదిరాజ్ యువజన సంఘం అధ్యక్షులు నందిమల్ల రవి ఆర్థిక సహాయం చేయడం జరిగింది.

Also Read : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ

ఈ సందర్భంగా నందిమల్ల రవి మాట్లాడుతూ బాలికల్లో క్రీడా నైపుణ్యం అభివృద్ధి చెందాలని, చదువులతో పాటుగా బాలికలందరూ క్రీడల్లో కూడా రాణించాలని, శారీరక దృఢత్వాన్ని ఆత్మరక్షణకై పొందుటకై ఈ క్రీడానైపుణ్యం ఎంతగానో ఉపయోగ పడుతుందని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అనన్య ఈ పోటీల్లో తప్పకుండా విజయం సాధించి తన తల్లిదండ్రులకు తన గురువు కరాటే శేఖర్ మాస్టర్ కి వనపర్తి ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని కోరడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గోజూరియో కరాటే కిక్ బాక్సింగ్ అకాడమీ మాస్టర్ కరాటే శేఖర్, సీనియర్ బాక్సర్ మద్ద శివకృష్ణ యాదవ్, నరేశ్ కుమార్ తదితరులు పాల్గొనడం జరిగింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube