డయాలసిస్ పేషెంట్ కి పించన్ పంపిణీ…

డయాలసిస్ పేషెంట్ కి పించన్ పంపిణీ...

1
TMedia (Telugu News) :

డయాలసిస్ పేషెంట్ కి పించన్ పంపిణీ…

టి మీడియా, ఏప్రిల్ 4,రాయవరం, : నదురుబాద గ్రామంలో డయాలసిస్ పేషెంట్ కి రాయవరం ఎంపీపీ నౌడు వెంకటరమణ చేతుల మీదగా అందజేశారు. మండలంలో నదురుబాద గ్రామంలో ఆదివారం వాసంసెట్టి శ్రీను గత కొన్ని రోజులుగా డయాలసిస్ తో బాధపడుతూ ఉండగా జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు సిరిపురపు శ్రీనివాసరావు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దృష్టికి తీసుకువెళ్లగా తక్షణమే శ్రీనుకి పింఛన్ మంజూరు చేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాయవరం ఎంపీపీ నౌడు వెంకటరమణ చేతులమీదుగా పదివేల రూపాయలు డయాలసిస్ పింఛన్ వాసంశెట్టి శ్రీను కి అందజేశారు. ఈ సందర్భంగా శ్రీను ఎంతో సంతోషించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కి రుణపడి ఉంటానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చింతపల్లి శ్రీనివాస్, ఉప సర్పంచ్ సత్యనారాయణ, గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటరీలు, గ్రామస్తులు ఉన్నారు.

Also Read : నాసిక్‌లో రైలు ప్ర‌మాదం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube