భారీ అగ్నిప్ర‌మాదం

భారీ అగ్నిప్ర‌మాదం

1
TMedia (Telugu News) :

భారీ అగ్నిప్ర‌మాదం

టీ మీడియా,సెప్టెంబర్ 19, కోల్‌క‌తా: ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రం కోల్‌క‌తా న‌గ‌రానికి స‌మీపంలోని హౌరాలో సోమ‌వారం మ‌ధ్యాహ్నం భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. హౌరాలోని ఓ క‌మ‌ర్షియ‌ల్ బిల్డింగ్‌లోగ‌ల బ్యాగుల దుకాణంలో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. క్ర‌మంగా ఆ మంట‌లు ప‌రిస‌ర దుకాణాల‌కు వ్యాపించాయి.

Also Read : ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి

ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే స్థానిక వ్యాపారులు పోలీసుల‌కు, అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం ఇచ్చారు.దాంతో పోలీసులు, ఫైర్‌ఫైట‌ర్స్ ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. ఆరు ఫైరింజ‌న్‌ల సాయంతో మంట‌ల‌ను ఆర్పేశారు. కోల్‌క‌తా న‌గ‌ర స‌మీపంలోని హౌరా మైదాన్ ఏరియాలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంద‌ని అధికారులు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube