భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

1
TMedia (Telugu News) :

భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

టీ మీడియా,సెప్టెంబర్ 21, చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు పట్టణంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. పట్టణంలోని రంగాచారి వీధిలో ఉన్న ఓ పేపర్‌ ప్లేట్ల తయారీ పరిశ్రమలో అర్ధరాత్రి 2 గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పరిశ్రమ మొత్తానికి వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. మంటల్లో చిక్కుకుని ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.

Also Read : డోనాల్డ్ ట్రంప్‌పై రేప్ కేసు

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్‌ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపుచేశారు. మృతులను పరిశ్రమ యజమాని భాస్కర్‌ (65), ఆయన కుమారుడు ఢిల్లీ బాబు (35), బాలాజీ (25)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని భావిస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube