రెస్టారెంట్ భ‌వ‌నంలో అగ్నిప్ర‌మాదం

రెస్టారెంట్ భ‌వ‌నంలో అగ్నిప్ర‌మాదం

1
TMedia (Telugu News) :

రెస్టారెంట్ భ‌వ‌నంలో అగ్నిప్ర‌మాదం

 

టీ మీడియా, నవంబర్ 1, ముంబై : మ‌హారాష్ట్ర‌లోని పుణేలో మార్వెల్ విస్టా భ‌వ‌నం టాప్ ఫ్లోర్‌లో మంగ‌ళ‌వారం భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. క్రికెట‌ర్ జ‌హీర్ ఖాన్ రెస్టారెంట్ ఇదే భ‌వ‌నంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంది. లులా న‌గ‌ర్ చౌక్‌లో మార్వెల్ విస్టా భ‌వ‌నంలో అగ్నిప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో అధికారులు హుటాహుటిన ఘ‌ట‌నా స్ధ‌లానికి చేరుకున్నారు.

Also Read : ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

ఆరు అగ్నిమాప‌క యంత్రాలు మంట‌ల‌ను అదుపులోకి తెచ్చేందుకు శ్ర‌మిస్తున్నాయి. ఈ ఘ‌ట‌న‌లో ఎలాంటి ప్రాణ‌, ఆస్తి న‌ష్టం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు. అగ్నిప్ర‌మాదానికి కార‌ణాలు ఇంకా తెలియ‌రాలేద‌ని అధికారులు వెల్ల‌డించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube