బస్సులో చెలరేగిన మంటలు, తప్పిన పెను ప్రమాదం

బస్సులో చెలరేగిన మంటలు, తప్పిన పెను ప్రమాదం

1
TMedia (Telugu News) :

బస్సులో చెలరేగిన మంటలు, తప్పిన పెను ప్రమాదం

టీ మీడియా, నవంబర్ 15, నిర్మల్ : నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని గంజాల్ టోల్ ప్లాజా వద్ద ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో మంటలు దట్టగా ఎగసిపడుతున్నాయి. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణీకులు ఉన్నారు. నాగ్ పూర్ నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. టోల్ ప్లాజా వద్దకు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయంతో బయటకు దూకి ప్రయాణికులుు ప్రాణాలు కాపాడుకున్నారు. బస్సు ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Also Read : సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు చేయకండి

అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. బాధితులను రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో జరిగిన ఘటనతో ప్రయాణీకులు, స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు దక్కించుకునేందుకు భయంతో పరుగులు తీశారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికీ ప్రమాదం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.నిబంధనలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి, ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube