డిపోలో భారీ అగ్నిప్రమాదం..
– 18 బస్సులు దగ్ధం
టీ మీడియా, అక్టోబర్ 30, బెంగళూరు : ఒక బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు, పొగలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో సుమారు 18 బస్సులు దగ్ధమయ్యాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. సోమవారం ఉదయం వీరభద్ర నగర్ సమీపంలో ఉన్న ప్రైవేట్ బస్ డిపోలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ డిపోలో పార్క్ చేసి ఉన్న బస్సుల్లో సుమారు 18 బస్సులు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది పది ఫైర్ ఇంజిన్లతో సంఘనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే మంటలను అదుపు చేశారు. కాగా, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరుగలేదని అగ్నిమాపక శాఖ డిప్యూటీ డైరెక్టర్ గురులింగయ్య తెలిపారు. మంటల్లో కాలిన ప్రైవేట్ బస్సులు రిపేర్ కోసం అక్కడ ఉన్నాయని చెప్పారు.
Also Read : రఘున్న ను ఎమ్మెల్యేగా గెలిపించుకొని,నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం
అగ్నిప్రమాదం జరిగినప్పుడు మెకానిక్‌లు, వెల్డింగ్ చేసే వ్యక్తులు కూడా ఉన్నారని అన్నారు. అయితే వారంతా పరుగులు తీసి అక్కడి నుంచి బయటపడ్డారని తెలిపారు. పెట్రోల్ వంటి మండే వస్తువులు ఆ డిపోలో పలు చోట్ల ఉన్నాయని తెలిపారు. అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వ్యాపించి ఈ అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube