చాందిని చౌక్‌లో భారీ అగ్నిప్రమాదం
టీ మీడియా, నవంబర్ 25, న్యూఢిల్లీ : పాత ఢిల్లీలోని చాందిని చౌక్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భగీరథి ప్యాలెస్ ఎలక్ట్రానిక్ మార్కెట్‌లో గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఓ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో క్రమంగా అవి పక్కనున్న షాప్‌లకు వ్యాపించడంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
Also Read : చైనాలో ఆల్‌టైమ్ హైకి రోజువారీ కరోనా కేసులు
40 ఫైరింజన్లతో రాత్రంతా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికి ఎలాంటి హాని జరుగలేదని అధికారులు వెల్లడించారు. బిల్డింగ్‌లోని చాలా షాపులు దెబ్బతిన్నాయని, భారీగా ఆస్తి నష్టం సంభవించిందని ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు.