వర్ధంతి వేడుకల్లో ఆర్కెస్ట్రా.. మంటలు చెలరేగి వాహనాలు దగ్ధం
వర్ధంతి వేడుకల్లో ఆర్కెస్ట్రా.. మంటలు చెలరేగి వాహనాలు దగ్ధం
వర్ధంతి వేడుకల్లో ఆర్కెస్ట్రా.. మంటలు చెలరేగి వాహనాలు దగ్ధం
టీ మీడియా, డిసెంబర్ 7, రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే తండ్రి వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ఆర్కెస్ట్రా కార్యక్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. వెంటనే తేరుకునే లోపు మంటలు వేగంగా వ్యాపించాయి. పక్కనే పార్కింగ్‌లో ఉన్న బైక్‌లకు మంటలు అంటుకున్నాయి. దీంతో దాదాపు పది వాహనాలకుపైగా కాలి బూడిదయ్యాయి. అయితే, ప్రాణనష్టం జరుకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అగ్ని ప్రమాదానికి మాత్రం కారణాలు తెలియరాలేదు.ఈ ఘటన సోంక్యారీ పోలీస్ పోస్ట్ ఏరియాలోని ఘఘ్రా గ్రామంలో చోటు చేసుకున్నది.
Also Read : అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాము
జాష్పూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ భగవత్ తండ్రి దేవ్రామ్ భగవత్ వర్ధంతి సందర్భంగా ఆర్కెస్ట్రా కార్యక్రమాని నిర్వహించారు. కార్యక్రమానికి చూసేందుకు పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. ఈ క్రమంలోనే వేదికకు కొంత దూరంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube