టింబర్‌ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

టింబర్‌ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

0
TMedia (Telugu News) :

టింబర్‌ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
టి మీడియా, జూన్14,హైదరాబాద్‌: నగర శివార్లలోని శంషాబాద్‌లో పెను ప్రమాదం తప్పింది. శంషాబాద్‌ పరిధిలోని రామాంజపూర్‌లో ఉన్న టింబర్‌ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున టింబర్‌ కంపెనీలో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి మొత్తానికి విస్తరించడంతో పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి.

Also Read : పోలీసుల ఓవరాక్షన్‌.. సీనియర్‌ నేతకు చేదు అనుభవం

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. విద్యుదాఘాతంతోనే టింబర్‌ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube