సెజ్‌లో భారీ పేలుడు.. ఒకరు మృతి
టీ మీడియా, జనవరి 31, విశాఖపట్నం : అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్)లో భారీ పేలుడు సంభవించింది. జీఎఫ్‌ఎంఎస్ ఫార్మా కంపెనీలో మంగళవారం ఉదయం రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ముగ్గురికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో.. భయాందోళనకు గురైన కార్మికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు అగ్నిమాపక అధికారులు విచారణ ప్రారంభించారు