అగ్నిప్రమాదంలో తల్లీకూతురు సజీవదహనం

అగ్నిప్రమాదంలో తల్లీకూతురు సజీవదహనం

1
TMedia (Telugu News) :

అగ్నిప్రమాదంలో తల్లీకూతురు సజీవదహనం
టి మీడియా, జూలై 2,కోనసీమ: కోనసీమ జిల్లాలో ఘోరం జరిగింది. జిల్లాలోని అల్లవరం మండలం కొమరగిరిపట్నంలో జరిగిన అగ్నిప్రమాదంలో తల్లి కూతురు సజీవదహనమైన ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో పూరి గుడిసె దగ్ధమైంది. తల్లి సాధనాల మంగాదేవి (40), కూతురు మెడిశెట్టి జ్యోతి (23) మృతి చెందింది. 5 నెలల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్న జ్యోతి ప్రస్తుతం గర్భవతి.అగ్నిప్రమాదం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read : వల్లభనేని వంశీకి కరోనా పాజిటివ్‌

దుండగుడు వీరిద్దరిని హత్య చేసి ఇల్లు తగలపెట్టారని అనుమానిస్తున్నారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అల్లవరం పోలీసులు అనుమానితుడు సురేశ్‌ను అదుపులోకి తీసుకున్న ప్రశ్నిస్తున్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube