మురికివాడలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగసిపడిన మంటలు

మురికివాడలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగసిపడిన మంటలు

0
TMedia (Telugu News) :

మురికివాడలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగసిపడిన మంటలు

టీ మీడియా, మార్చ్ 3, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. న్యూఢిల్లీలోని సుల్తాన్‌పురిలో ఉన్న మురికి వాడల్లో శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి ఆ ప్రాంతమంతా విస్తరించడంతో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 15 ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎవరూ గాయపడలేదని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నదని డివిజనల్‌ ఫైర్‌ ఆఫీసర్‌ ఏకే జైశ్వాల్‌ తెలిపారు. 15 ఫైర్‌ ఇంజిన్లతో మంటలను ఆర్పివేశామన్నారు. ఇప్పటివరకు ఎవరికీ గాయాలవలేదని చెప్పారు. ఈ ఆపరేషన్‌లో రోబోలను కూడా వినియోగించామని, అవి సమర్ధవంతంగా పనిచేశాయన్నారు.

Also Read : లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బీజేపీ ఎమ్మెల్యే కొడుకు

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube