కారులో చెలరేగిన మంటలు

తప్పిన ప్రమాదం..

1
TMedia (Telugu News) :

కారులో చెలరేగిన మంటలు
-తప్పిన ప్రమాదం..
టీ మీడియా.జులై 1,హైదరాబాద్‌: నగరంలోని మాదాపూర్‌లో పెను ప్రమాదం తప్పింది. హైటెక్ సిటీ సమీపంలో ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉన్నవారు అప్రమత్తమవడంతో ప్రాణనష్టం తప్పింది. కారు నడుస్తుండగా మంటలు చెలరేగాయి. అయితే అందులో ఉన్నవారు వాటిని గుర్తించి వెంటనే దిగిపోయారు. మంటలకు కారు ధ్వసమయింది.

Also Read : జగిత్యాల వాసి కిడ్నాప్‌..

ఈ నేపథ్యంలో హైటెక్ సిటీ దారిలో వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును రోడ్డుపైనుంచి తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. కారు ప్రమాదంపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube