కారులో చెలరేగిన మంటలు
-తప్పిన ప్రాణనష్టం
టీ మీడియా ,జులై 30,హైదరాబాద్: నగరంలోని లంగర్ హౌస్లో పెను ప్రమాదం తప్పింది. శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో టిప్పుఖాన్ బ్రిడ్జిపై ఓ కారులో మంటలు చెలరేగాయి. గుర్తించిన డ్రైవర్ కారును నిలిపి అందులోనుంచి దిగిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. క్రమంగా మంటలు కారు మొత్తానికి వ్యాపించడంతో అది దగ్ధమయింది.
Also Read : ఫ్యాషన్ .. ఫ్యాషన్ చెవులకు పెయింటింగ్!
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదం ఎవరికి గాయాలవలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉన్నది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube