ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..

1
TMedia (Telugu News) :

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..
టి మీడియా,జూన్‌ 29,ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగోల్‌పురిలోని ఫేజ్-1 ప్రాంతంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి కంపెనీ మొత్తానికి వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు వ్యాపించడంతో ఆ ప్రాంతంలో పెద్దఎత్తున పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 26 ఫైరింజన్లతో మంటలను అదుపుచేశారు. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు.

Also Read : ఎంపీ రవిచంద్రని కలిసిన తెలంగాణ రాష్ట్ర మెడికల్ & హెల్త్ డైరెక్టర్

తారాపూర్‌ పారిశ్రామిక వాడలో..
మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లాలో ఉన్న తారాపూర్‌ పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం జరిగింది. ఇండస్ట్రియల్‌ ఏరియాలోని ఓ పరిశ్రమలో వరుస పేలుళ్లతో భారీగా మంటలు ఎగసిపడుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube