అగ్ని ప్రమాద నివారణపై అవగాహన

అగ్ని ప్రమాద నివారణపై అవగాహన

1
TMedia (Telugu News) :

అగ్ని ప్రమాద నివారణపై అవగాహన

టీ మీడియా, ఏప్రిల్ 9, మధిర: నగర పంచాయతీ పరిధిలోని జిలుగుమాడు ఫైర్ స్టేషన్ కి సంబంధించిన అగ్నిమాపక దళ సిబ్బంది, ఫైర్ అధికారి వెంకటేశ్వరరావు నేతృత్వంలో మాటూరు హైస్కూల్ విద్యార్థులకు అగ్ని ప్రమాదాల నివారణపై చక్కని అవగాహన కల్పించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు దీవి సాయికృష్ణమాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఫైర్ అధికారి వెంకటేశ్వరరావు, లీడింగ్ ఫైర్ మెన్ రాంబాబు, భాస్కర్ లు అగ్ని ప్రమాద సమయాల్లో నివారణకు వారు ఉపయోగించే వివిధ రకాల వస్తువులను వాటిని ఉపయోగించే విధానాన్ని విద్యార్థులకు సవివరంగా తెలియజేశారు.

Also Read : సింగ‌రేణిలో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే..

అనంతరం గ్యాస్ సిలిండర్ నుంచి మంట వచ్చే సందర్భంలో ఎలా నిరోధించాలో ప్రత్యక్షంగా విద్యార్థులకు అవగాహన పరచడం జరిగింది. అనంతరం ఉత్తమ లీడింగ్ ఫైర్మెన్ అవార్డు గ్రహీత రాంబాబును పాఠశాల సిబ్బంది దుశ్శాలువాతో సత్కరించడం జరిగింది. అనంతరం పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు అగ్ని ప్రమాదాల నివారణ పై వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు లీడింగ్ ఫైర్ మెన్ రాంబాబు, కె మోహన్, బి భాస్కర్ రావు టి మోహన్, కె రాంప్రసాద్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube