ఆస్పత్రిలో మంటలు..

డాక్టర్ సజీవ దహనం

1
TMedia (Telugu News) :

 

ఆస్పత్రిలో మంటలు..డాక్టర్ సజీవ దహనం, ఇద్దరు పిల్లలు మృతి

 

టీ మీడియా,సెప్టెంబర్ 25, రేణిగుంట:తిరుపతి జిల్లా రేణిగుంటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఆ అగ్నిప్రమాదం ఓ వైద్యుడి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.ఆస్పత్రిలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆస్పత్రి పై పోర్షన్‌ లో వుంటున్న వైద్యుడి కుటుంబం మంటల్లో చిక్కుకుపోయింది. ఈ ప్రమాదంలో వైద్యుడితో పాటు ఆయన కుమార్తె, కుమారులు మృతిచెందారు. వైద్యుడు ఘటనాస్థలంలోనే సజీవ దహనం కాగా.. ఆయన పిల్లలిద్దరూ చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో ఆప్రాంతంలో విషాదం నెలకొంది. ఆస్పత్రిలో మరికొందరు చిక్కుకుని పోయారని తెలుస్తోంది. రెస్క్యూ టీం ఇద్దరిని కాపాడింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube