ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి
టీ మీడియా, మార్చి1, హైదరాబాద్ : నగరంలోని కుత్బుల్లాపూర్ జీడిమెట్లలోని ఆరోరా ఫార్మాసూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో బుధవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం మధ్యాహ్నం కెమికల్ ల్యాబ్ లో రియాక్టర్ పేలి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఆ సమయంలో ల్యాబ్‌లో పనిచేస్తున్న రవీందర్ రెడ్డి(25), కుమార్ (24) ఇద్దరు యువకులు మంటల నుంచి తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసినా వారి ప్రయత్నాలు విఫలమై ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా విషయం తెలుసుకున్న జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు.