మురికవాడలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

మురికవాడలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

1
TMedia (Telugu News) :

మురికవాడలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

టి మీడియా, డిసెంబర్ 10, గువాహటి‌ : అసోంలోని గువాహటిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి నగరంలోని ఫటాసిల్‌ అంబారి ప్రాంతంలో ఉన్న మురికివాడలోని ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పక్కన ఉన్న గుడిసెలకు వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న ఇండ్లన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

Also Read : పంజాబ్‌లో పోలీస్‌స్టేషన్‌పై రాకెట్‌ గ్రనేడ్‌తో దాడి

అయితే అప్పటికే పెద్ద సంఖ్యలో ఇండ్లు, లక్షల్లో నగదు కాలిపోయాయి. కాగా, సిలిండర్‌ పేలడంతో అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నదని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube