అధికారులు జోక్యం చేసుకోండి -అగ్నిమాపక అధికారి ఆవేదన

అధికారులు జోక్యం చేసు కోండి -అగ్నిమాపక అధికారి ఆవేదన

0
TMedia (Telugu News) :
fire officer
fire officer

ఉన్నతాధికారులు జోక్యం చేసుకోండి.ట్రిజరి లోపెండింగ్ లో ఉన్న నా బిల్లులు మంజూరు చేయించండి.నేను బెడ్ పై ఉన్న ఆర్ధిక ఇబ్బంది పడుతున్న అంటూ ఒక అగ్నిమాపక శాఖ అధికారి వాట్స్ ప్ సందేశము లో తన ఆవేదన వెళ్ళ గక్కారు. ఒక అధికారి బిల్లుల కోసం వేడూకోవాల్సిన పరిస్థితి రావడం ట్రిజరి శాఖ లో ఉన్న అవినీతి తిమింగ లాల గురించి తెలియ చేస్తోంది. సందేశం పరిశీలిస్తే..

ALSO READ: రైతన్న సినిమాకు ఎమ్మెల్యే సీతక్కను ఆహ్వానించిన ఆర్ నారాయణ మూర్తి

అయ్యా నేను అగ్నిమాపక కేంద్ర అధికారి దేవనందీ శ్రీనివాస్ అశ్వరావుపేట గత ఐదున్నర సంవత్సరాల నుండి నేను ఉద్యోగం చేస్తూ అశ్వరావుపేట నియోజకవర్గ ప్రాంత ప్రజలకు ఎంతో మెరుగైన సేవలు అందిస్తూ విధులు నిర్వహించాను. నా యొక్క అనారోగ్య కారణాల వల్ల నేను డిప్యూటేషన్ పై పెద్దపెల్లి జిల్లా మంథని అగ్నిమాపక కేంద్రం వెళ్ళుటకు మా డిపార్ట్మెంట్ పై అధికారులకు రిక్వెస్ట్ పెట్టుకోగా సెప్టెంబర్ 14 వ తేదీన ఉత్తర్వులు జారీ చేసినారు, నేను 15-09-2021 రోజున అగ్నిమాపక కేంద్ర మంథనిలో జాయిన్ అయి విధులు నిర్వహిస్తున్నాను, నాకు సంబంధించిన జీతం బత్తెంల బిల్లులు మరియు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు, GPF బిల్లులు తేదీ 12 ఆక్టోబర్ 21 రన అగ్నిమాపక కేంద్రం అశ్వరావుపేట అధికారులు ఎస్టీఓ అధికారులకు సబ్మిట్ చేసినరని అన్నారు. అక్కడి అధికారులు సంబంధించిన బిల్లు పక్కన పడేసారనిఆరోపించారు. ట్రెజరీ అధికారులుతప్పు ఒప్పులు ఉంటే 7 రోజుల లోపు రిటర్న్ చేయవలసిన బాధ్యత , ట్రెజరీ అధికారులు పై ఉన్నది అన్నారు.ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. నాకు యాక్సిడెంట్ అయి లెఫ్ట్ హ్యాండ్ & పక్కటి ఎముకలు విరిగి హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాను అని ఆవేదన వ్యక్తం చేశారు.వెంటనే సర్జరీ చేశారు, ప్రస్తుతం చాలా ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాను దయచేసి మీరు నా బాధ అర్థం చేసుకొని స్పందించి నాకు సహాయం చేయగలరని కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube