నిస్సహాయుల ఆశ్రమంలో పిల్లలకు టపాసుల పంపిణీ

నిస్సహాయుల ఆశ్రమంలో పిల్లలకు టపాసుల పంపిణీ

0
TMedia (Telugu News) :

నిస్సహాయుల ఆశ్రమంలో పిల్లలకు టపాసుల పంపిణీ

 

టి మీడియా,అక్టోబర్ 25,గోదావరిఖని :వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం గోదావరిఖని విట్టల్ నగర్ లోని అమ్మ పరివార్ పిల్లల నిస్సహాయుల పిల్లల ఆశ్రమంలోని పిల్లలకు టపాసులు,స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం వెలుగు సామాజిక స్వచ్ఛ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు చైర్మన్ డాక్టర్ సురభి శ్రీధర్ మాట్లాడారు…ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులు తమ పిల్లలతో ఆనందంగా దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారని అన్నారు.నిస్సహాయులైన పిల్లలకు తమ తల్లిదండ్రులు తమ దగ్గర లేరుఅనే ఆలోచన రావద్దనే ఉద్దేశంతో ఆశ్రమం లోని పిల్లలకు ఎస్.ఆర్.ఆర్ గోదావరిఖని బ్రాంచ్ సహకారంతో టపాసులు అందించడం జరిగిందని సురభి శ్రీధర్ అన్నారు.

Also Read : ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ ఘనంగా పుట్టినరోజు వేడుకలు

ఎస్, ఆర్.ఆర్.ఫైర్ వర్క్ గోదావరిఖని నిర్వాహకులు గంప పద్మ రాజమౌళి, టపాసులు అడిగిన వెంటనే స్పందించి టపాసులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ సహస్ర,ఆర్గనైజర్లు, కనక లక్ష్మి,స్వరూప, (రామగుండం) శ్రావణి, రాజకుమారి,ఆశ్రమ నిర్వాహకులు మంద నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube