పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు

పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు

1
TMedia (Telugu News) :

పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు

టీ మీడియా, ఆగస్టు 19, ములుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మండలంలోని వీరాపురం సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భద్రాద్రి జిల్లా దామెరతోగు సమీప అడవుల్లో కూంబింగ్‌ పార్టీకి.. మావోయిస్టులు తారపడ్డారు.

Also Read : శ్రీవారిని దర్శించుకున్న కర్ణాటక సీఎం

దీంతో అక్కడినుంచి తప్పించుకునే క్రమంలో పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఇరుపక్షాల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube