పాకిస్థాన్ రేంజ‌ర్ల కాల్పులు

ఇద్ద‌రు బీఎస్ఎఫ్ జ‌వాన్ల‌కు గాయాలు

0
TMedia (Telugu News) :

పాకిస్థాన్ రేంజ‌ర్ల కాల్పులు

– ఇద్ద‌రు బీఎస్ఎఫ్ జ‌వాన్ల‌కు గాయాలు

టీ మీడియా, అక్టోబర్ 27, జ‌మ్మూ: జ‌మ్మూలోని ఆర్నియా సెక్టార్‌లో గురువారం రాత్రి కాల్పుల ఘ‌ట‌న జ‌రిగింది. పాకిస్థాన్ రేంజ‌ర్లు కాల్పులు జ‌రిపారు. ఆ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు బీఎస్ఎఫ్ జ‌వాన్లు గాయ‌ప‌డ్డారు. అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు ఆర్నియాతో పాటు సుచేత్‌ఘ‌ర్ సెక్టార్ల‌లో ఈ కాల్పులు జ‌రిగాయి. రాత్రి 8 గంట‌ల ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు బీఎస్ఎఫ్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. అయితే ఆ పాక్ రేంజ‌ర్ల కాల్పుల‌కు దీటుగా బ‌దులు ఇచ్చిన‌ట్లు చెప్పారు. జ‌మ్మూ బోర్డ‌ర్ వ‌ద్ద పాక్ రేంజ‌ర్ల కాల్పుల వ‌ల్ల ఇండ్లు ధ్వంసం అయ్యాయి. ఆర్ఎస్ పురా సెక్టార్‌లోని అర్నియాలో ఇండ్లు కొన్ని దెబ్బ‌తిన్నాయి.

Also Read : సిరియాలో ఆయుధ కేంద్రాల‌పై అమెరికా వైమానిక దాడులు

రాత్రంతా కాల్పులు జ‌ర‌గ‌డం వ‌ల్ల స్థానిక గ్రామ ప్ర‌జ‌లు బంక‌ర్ల‌లోనే ఉండిపోయారు. బంక‌ర్లు పెద్ద‌గా ఉండ‌డం వ‌ల్ల త‌మ ప్రాణాలను కాపాడుకున్న‌ట్లు గ్రామ‌స్థులు తెలిపారు. రేంజ‌ర్ల కాల్పుల్లో గాయ‌ప‌డ్డ ఓ జ‌వానుకు స్థానిక ఆస్ప‌త్రిలో చికిత్స‌ను అందించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube