మసీదులో కాల్పులు, ఇమామ్‌ సహా 12 మంది మృతి

మసీదులో కాల్పులు, ఇమామ్‌ సహా 12 మంది మృతి

1
TMedia (Telugu News) :

మసీదులో కాల్పులు, ఇమామ్‌ సహా 12 మంది మృతి

టీ మీడియా, డిసెంబర్ 5, నైజీరియా : నైజీరియాలోని ఓ మసీదులో దుండగులు జరిపిన కాల్పుల్లో 12 మంది చనిపోయారు. మృతుల్లో మసీదు ఇమామ్‌ కూడా ఉన్నాడు. దాడికి దిగిన వ్యక్తులు కొందరు వ్యక్తులను కిడ్నాప్‌ చేసినట్లుగా సమాచారం. బంధీలను విడిచిపెట్టేందుకు డబ్బు డిమాండ్‌ చేసినట్లు తెలుస్తున్నది. మసీదులోకి వచ్చీరావడతో విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. నైజీరియాలోని ఫంతువా ప్రాంతంలో ఉన్న మగుమ్‌జీ మసీదులో ప్రజలు నమాజ్‌ చేస్తున్నారు. ఇంతలో మసీదులోకి పరిగెత్తుకు వచ్చిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇమామ్‌తో పాటు 12 మంది చనిపోయారు. ఈ దాడికి పాల్పడింది ఒక ముఠాగా అక్కడి పోలీసులు అనుమానిస్తున్నారు. బంధీలుగా ఉన్న వారిని విడిచేందుకు డబ్బు డిమాండ్‌ చేసినట్లుగా తెలుస్తున్నది. ఇదే సమయంలో వ్యవసాయం చేయడానికి అనుమతి తీసుకోవాలని, రక్షణ పొందడం కోసం కూడా రుసుము చెల్లించాలని దుండగులు చెప్పినట్లుగా స్థానిక పోలీసులు పేర్కొంటున్నారు.

Also Read : నకిలీ బాబా ఫోన్ ఓపెన్ చేస్తే మొత్తం అవే

ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మోటర్‌ బైకులపై వచ్చిన దుండగులు మగుమ్‌జీ మసీదుకు చేరుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ప్రజలు భయాందోళనకు గురై ప్రాణాలను రక్షించుకోవడానికి తలో దిక్కు పరిగెత్తారు. కాల్పులు జరిపిన తర్వాత కొంతమందిని ఎత్తుకుని పొదల్లోకి తీసుకెళ్లారు. మసీదులో దుండగుల కాల్పులను నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్‌ బుహారీ తీవ్రంగా ఖండించారు. ద్వేషపూరిత ఆలోచనలు ఉన్నవారే ఇలాంటి నీచానికి దిగి ప్రజలను చంపేశారని అన్నారు. ఇలాంటి ద్వేషపూరిత వ్యక్తుల ముందు దేశం ఎన్నటికీ తలవంచదని ఆయన పేర్కొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube